బ్రిడ్జి కోర్సు నిర్వహణకు సిద్ధం
AP : బ్రిడ్జి కోర్సు నిర్వహణకు సిద్ధం
విద్యార్థులకు వర్కు బుక్స్‌ను ఎస్‌సీఈఆర్టీ సిద్ధం చేస్తోంది. పిల్లలకు బ్రిడ్జి కోర్సుతోపాటు తల్లిదండ్రులకు ఆంగ్ల మాధ్యమంపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
➧ దీనికి సంబంధించిన సమయసారణిని అధికారులు విడుదల చేశారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సమయసారిణి ఇదీ..
➧ ఉదయం 8 నుంచి 8.30 గంటల వరకు అసెంబ్లీ, 8.30 నుంచి 9.15 గంటల వరకు రెయిమ్స్ తరువాత ఐదు నిమిషాలు విరామం ఇస్తారు.
➧ 9.20 నుంచి 10.05 గంటల వరకు ఆటలు ఆడిస్తారు. పది నిమిషాల విరామం తరువాత 10.15 నుంచి 11 గంటల వరకు రాత నైపుణ్యాన్ని పెంచడం, 11 నుంచి 11.45 గంటల వరకు స్టోరీటైమ్, 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హాస్య సమయం (ఫన్‌టైమ్)గా కేటాయించారు.
➧ బేస్‌లైన్ పరీక్ష నుంచి తుది పరీక్ష వరకు, ఏరోజు ఏమేం నిర్వహించాలో షెడ్యూలు అందజేశారు.
➧ 23న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.
No Comment to " బ్రిడ్జి కోర్సు నిర్వహణకు సిద్ధం "