TTD -టీటీడీ కొత్త రూల్... ఇకపై గదుల బుకింగ్ ఇలా...
తిరుమలలో (కొండపైన) గదుల బుకింగ్ విధానంలో మార్పులు-చేర్పులూ
చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవాస్థానం (టీటీడీ) తెలిపింది. దాని
ప్రకారం... అద్దె గదులను ముందుగా బుక్ చేసుకునే భక్తులు కాషన్ డిపాజిట్
చెల్లించే విధానాన్ని తెచ్చింది. దీని ప్రకారం ఎన్ని గదులు బుక్ చేసుకుంటే
అన్ని గదులకు ఎంత కాషన్ డిపాజిట్ (గదికి ఉండే అద్దెకు తగ్గట్టు)
చెల్లించాలో.. అంత మొత్తాన్ని ఆన్‌లైన్‌లో టీటీడీ ఖాతాకు చెల్లించాల్సి
ఉంటుంది. భక్తులు గదిని ఖాళీ చేసే సమయంలో డిపాజిట్‌ను తిరిగి వెనక్కి
ఇవ్వనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ విధానాన్ని ఈ నెల చివరికల్లా ఆఫ్ లైన్
బుకింగ్ విధానంలో కూడా అమల్లోకి తేవనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
అందువల్ల ఇప్పటికైతే... ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకునేవారికి... ఈ కాషన్ డిపాజిట్ విధానం అమల్లోకి వచ్చినట్లైంది.
ఈ విధానం తేవడానికి బలమైన కారణం ఉంది. చాలా మంది ముందుగా రూమ్స్ బుక్ చేసుకుంటున్నారు. తీరా ఆ తేదీకి తిరుమలకు రావట్లేదు. ఫలితంగా వాళ్ల పేరున బుక్ అయిన రూమ్ వృథా అవుతోంది. ఇలా చాలా మంది చేస్తుండటంతో... నిజంగా గదుల కోసం ప్రయత్నించే చాలా మందికి అసౌకర్యం కలుగుతోంది. దీన్ని గుర్తించిన టీటీడీ... సీరియస్‌గా గదుల కోసం ప్రయత్నించే వారికే అవి దక్కాలని భావించింది. ఇందుకు ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించి... ఈ కాషన్ డిపాజిట్ విధానం తెచ్చింది. దీని వల్ల కచ్చితంగా తిరుమల వెళ్లాలని డిసైడైన వారే... కాషన్ డిపాజిట్ చెల్లించి తిరుమల వెళ్తారు. తద్వారా రూమ్స్ వేస్ట్ కావు. అలా వెళ్లిన వారు రూమ్స్ ఖాళీ చెయ్యగానే కాషన్ డిపాజిట్ వెనక్కి ఇచ్చేస్తారు కాబట్టి వాళ్లకు ఎలాంటి సమస్యా ఉండదు.

No Comment to " TTD -టీటీడీ కొత్త రూల్... ఇకపై గదుల బుకింగ్ ఇలా... "