బడి నిధుల వినియోగానికి తల్లిదండ్రుల కమిటీలకు చెక్‌పవర్

తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీ సభ్యులకు శిక్షణ
‘నాడు-నేడు’ కింద మొదటి విడతలో ఎంపికైన పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు నిధులను పారదర్శకంగా వినియోగించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ప్రతి వ్యయానికి చెక్కు ద్వారానే చెల్లింపులు చేయాలని సర్కారు సూచించింది. ఈ మేరకు చెక్‌పవర్ వినియోగాన్ని కట్టుదిట్టం చేసింది. నిధుల వినియోగానికి సంబంధించి ఏదైనా చెక్కు చెల్లుబాటు కావాలంటే ఐదుగురు సభ్యులతో కూడిన తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీ సంతకాలు చేయాల్సి ఉంటుంది. నాడు-నేడు కింద ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం కావడంతో జిల్లా విద్యాశాఖాధికారి చెక్‌పవర్ వినియోగానికి సంబంధించిన సంయుక్త సంతకాల కమిటీ వివరాలను ఈ నెల 27లోపు తయారు చేసి పంపాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
కమిటీ ఏర్పాటు ఇలా...
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పంచాయతీరాజ్ ఇంజినీరు కలిపి ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవాలి. ఏడుగురు సభ్యుల్లో ఐదురుగు తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీ సభ్యులు ఉండాలి. వీరిలో కచ్చితంగా ముగ్గురు మహిళా సభ్యులు ఉండాలి. ఇద్దరు ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి.

No Comment to " బడి నిధుల వినియోగానికి తల్లిదండ్రుల కమిటీలకు చెక్‌పవర్ "