News Ticker

Menu

AP SSC Public Exams 2019-20 Blue Print & Model Papers by SCERT

 AP SSC  Public Exams 2019-20 New Pattern Question Papers


ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే పదో తరగతి ప్రశ్నపత్రంలో మార్పులు చేస్తామని ఏపీ మంత్రి సురేశ్‌ చెప్పారు. అమరావతిలో 26-09-2019 నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రశ్నపత్రంలో 20 శాతం మేర ఇంటర్నల్‌ అసెస్‌మెంట్ ఉంది. ఇంటర్నల్ అసెస్‌మెంట్ కార్పొరేట్ పాఠశాలలకు అనుకూలంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్నల్‌ అసెసెమెంట్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నాం. పదో తరగతి పరీక్షల్లో బిట్‌ పేపరును తొలగిస్తున్నాం. ప్రశ్నపత్రంలోనే బిట్ పేపర్‌ భాగంగా ఉంటుంది. మాస్‌ కాపీని అరికట్టేందుకే ఈ నిర్ణయం. విద్యార్థికి అదనంగా 15 నిమిషాలు కేటాయిస్తాం. ఈ విద్యా సంవత్సరం నుంచే మార్పు అమలు చేస్తాం’’ అని మంత్రి సురేష్ అన్నారు.

పదో తరగతి పరీక్ష విధానంలో సంస్కరణలకు ప్రభుత్వం తెరదీసింది. ఇక నుంచి ప్రశ్నపత్రం స్వరూపం మారబోతోంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో భాగంగా గత మూడేళ్లుగా అమలు చేసిన అంతర్గత మార్కుల పద్ధతిని ప్రభుత్వం ఎత్తివేసిన నేపథ్యంలో ప్రశ్నావళి సరళిలో పలు మార్పులు తెచ్చారు. గతంలో మెయిన్‌ పేపర్‌.. బిట్‌ పేపర్‌ విడివిడిగా ఉండేవి. ఇకపై మెయిన్‌ పేపర్‌లోనే బిట్లు కూడా కలిసే ఉంటాయి. పాత మోడల్‌లో బిట్‌ పేపర్‌లో ఏ, బీ, సీ, డీ.. మల్టిపుల్‌ చాయి్‌సతో కొన్ని ప్రశ్నలు ఉండేవి. అయితే, ఇప్పుడు ఈ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో లక్ష్యాత్మక ప్రశ్నలు ఇస్తారు. అంటే విద్యార్థి ప్రతి ప్రశ్నకు కనీసం ఒకటి లేదా రెండు పదాలతో కూడిన సమాధానం రాయాలి. పలు మార్పులతో కూడిన ప్రశ్నపత్రంతో పాటు విద్యా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఒక ముసాయిదా (బ్లూప్రింట్‌) ను పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్‌ సిద్ధం చేసింది. దీని ప్రకారం.. 2019-20 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షల్లో అంతర్గత మార్కులు ఉండవని స్పష్టమైంది.

32 ప్రశ్నలు.. 50 మార్కులు
🔹1/2 మార్కు ప్రశ్నలు 12. వీటికి 6 మార్కులు(పాత విధానంలో 1/2 మార్కు ప్రశ్నలు 20 ఉండేవి). 1 మార్కు ప్రశ్నలు 8. వీటికి 8 మార్కులు ఉంటాయి. 2 మార్కుల ప్రశ్నలు 8. వీటికి 16 మార్కులు. 4 మార్కుల ప్రశ్నలు 5. వీటికి 20 మార్కులు.

అన్నీ రాయాల్సిందే
🔹ప్రశ్న పత్రానికి సంబంధించి అన్ని సమాధానాలను విద్యార్థి రాత పూర్వకంగానే పేర్కొనాలి. 1/2 మార్కు ప్రశ్నకు ఒక పదంతో, 1 మార్కు ప్రశ్నకు ఒకటి లేదా రెండు వాక్యాల్లో, 2 మార్కుల ప్రశ్నకు మూడు నుంచి 4 వాక్యాల్లో, 4 మార్కుల ప్రశ్నకు ఆరు నుంచి 8 వాక్యాల్లో సమాధానం రాయాలి.

15 నిమిషాల పెంపు
🔸పాత విధానంలో పరీక్ష సమయం 2.30 గంటలు ఉండేది. కొత్త విధానంలో మరో 15 నిమిషాలు పెంచారు. దీంతో పరీక్ష సమయం 2.45 గంటలు ఉంటుంది. అయితే, కాంపోజిట్‌ తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలకు 3 గంటల సమయం ఇస్తారు. కాగా, ఈ పేపర్లను 70 మార్కులకే నిర్వహిస్తారు.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " AP SSC Public Exams 2019-20 Blue Print & Model Papers by SCERT "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM