గ్రామ వాలంటీర్లుగా విద్యార్థుల తొలగింపు
గ్రామ వాలంటీర్లుగా విద్యార్థుల తొలగింపు
గ్రామ సచివాలయ వాలంటీర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
తీసుకుంది. ఇప్పటికే గ్రామ వాలంటీర్ల ఎంపిక పూర్తయింది. వారికి శిక్షణ కూడా
ఇస్తున్నారు. త్వరలోనే గ్రామవాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
పెన్షన్ పంపిణీ, బియ్యం డోర్ డెలివరీ, రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ
కార్డులను వీరి ద్వారానే పంపిణి చేయనున్నారు.
అయితే గ్రామ
వాలంటీర్లుగా కొందరు కాలేజీ విద్యార్థులు ఎంపిక కావడం ప్రభుత్వం దృష్టికి
వచ్చింది. మరికొందరు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ కూడా గ్రామ వాలంటీర్లుగా
అవకాశం సంపాదించినట్టు ఫిర్యాదులు వచ్చాయి.
ఈనేపథ్యంలో
చదువుకునే విద్యార్థులుగానీ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు గానీ
వాలంటీర్లుగా ఎంపికై ఉంటే వారిని తక్షణం గుర్తించి తొలగించాలని పంచాయతీరాజ్
శాఖ ఆదేశాలు జారీ చేసింది.
చదువుకునే విద్యార్థులకు గ్రామ వాలంటీర్లుగా
బాధ్యతలు అప్పగిస్తే వారి చదువులు దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వం
భావించింది. దాని ప్రభావం వారి భవిష్యత్తుపై పడుతుందన్న ఉద్దేశంతో ఈ
నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గ్రామ వాలంటీర్‌గా
అవకాశం పొందిన వారిని కూడా పక్కన పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
No Comment to " గ్రామ వాలంటీర్లుగా విద్యార్థుల తొలగింపు "