చిన్న కోర్సులు.. పెద్ద జీతాలు!
చిన్న కోర్సులు.. పెద్ద జీతాలు!
అభ్యర్థులు
అప్‌డేట్ అవుతున్న కొద్దీ ఆర్థికరంగం ఆకర్షణీయమైన వేతనాలను అందిస్తుంది.
ప్రొఫెషనల్ కోర్సులు, ప్రత్యేక డిగ్రీలు చేస్తేనే ఆ అవకాశాలు
అందుతాయనుకుంటే పొరపాటు. కొన్ని సర్టిఫికేషన్ కోర్సులు చేసినా మంచి
ఉద్యోగాలు లభిస్తాయి. అకౌంటింగ్, ఆడిటింగ్, ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ల
విశ్లేషణ తదితర ఎన్నో విభాగాల్లో ఈ సర్టిఫికేషన్ కోర్సులు ఉన్నాయి. ఆసక్తి
ఉన్నదాన్ని ఎంచుకొని, నేర్చుకొని వృత్తిపరమైన అభివృద్ధిని సాధించవచ్చు.
ప్రపంచ వర్తక, వాణిజ్యాలన్నీ అంకెలు, గణాంకాలు,
విశ్లేషణలనే ఆధారం చేసుకొని నడుస్తున్నాయి. అందులోనూ ఆర్థిక, బీమా,
పెట్టుబడి రంగాల్లో వాటికి ప్రాధాన్యం మరీ ఎక్కువ. అలాంటి లెక్కలు,
అనాలిసిస్‌లను నేర్చుకొని అభివృద్ధిని సాధించాలంటే ఏం చేయాలి? ప్రొఫెషనల్
కోర్సులు, ప్రత్యేక డిగ్రీలు చేయాలా? ఇంకా ఎంతకాలాన్ని ఖర్చు పెట్టాల్సి
ఉంటుందో.. ఇలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సర్టిఫికేషన్లు చేస్తే
ఆ ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ముఖ్యంగా బీకామ్ కోర్సుల వారికి
ఇవి మరింత ఉపయోగకరం. సంప్రదాయ డిగ్రీలతో పోలిస్తే వీటిని పూర్తిచేసుకున్న
వారికి ఉపాధి అవకాశాలతోపాటు వేతనాలూ ఎక్కువే. సర్టిఫికేషన్లను అందిస్తున్న
సంస్థలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినవి కావడం వల్ల అవకాశాలు అంతటా
లభిస్తాయి. ఇలాంటి సర్టిఫికేషన్లు ఇప్పుడు రెజ్యూమెకి అదనపు ఆకర్షణగా
మారాయి.
సర్టిఫైడ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్
దీన్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ (ఐఎంఏ) అందిస్తోంది. ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్, మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ల కోసం అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సర్టిఫికేషన్ కోర్సు ఇది. దీన్ని చేస్తే అకౌంటింగ్‌పై లోతైన పరిజ్ఞానం వస్తుంది. మన దేశంతోపాటు, ఇతర దేశాల్లోనూ ఈ నిపుణులకు డిమాండ్ ఉంది. డిగ్రీతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు ఈ పరీక్ష రాసుకోవచ్చు. పరీక్షలో రెండు విభాగాలుంటాయి. ఒక్కో విభాగంలోనూ వంద మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు 30 నిమిషాల వ్యవధిలో రెండు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (సీఎఫ్‌ఏ)
సీఎఫ్‌ఏ సంస్థ ఈ కోర్సును అందిస్తోంది. దీనికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉంది. ఈ కోర్సు ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ అనాలిసిస్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ స్కిల్స్‌పై మంచి అవగాహన ఏర్పడుతుంది. ఇందులో మూడు స్థాయులుంటాయి. మొదటి లెవెల్‌ను ఏటా జూన్, డిసెంబరుల్లో అందిస్తారు. లెవెల్-2, 3లను జూన్‌లో మాత్రమే నిర్వహిస్తారు. ప్రతి లెవెల్‌లోనూ 2 సెషన్లు ఉంటాయి. ఏదైనా డిగ్రీ ఉన్నవారు ఈ కోర్సుకు అర్హులు.

చార్టర్డ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ అనలిస్ట్ (సీఏఐఏ)
సీఏఐఏ అసోసియేషన్ దీన్ని అందిస్తోంది. ఇది ఫైనాన్స్‌లో అడ్వాన్స్‌డ్ స్థాయి సర్టిఫికెట్ కోర్సు. దీన్ని పూర్తిచేసిన వారికి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్లపై అవగాహన కలుగుతుంది. ఇందులో రెండు స్థాయులుంటాయి. ఏటా మార్చి, సెప్టెంబరుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. లెవెల్-1లో 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వస్తాయి. లెవెల్-2లో వంద మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతోపాటు 3 వ్యాసరూప ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఈ పరీక్ష రాసుకోవచ్చు.

ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్
గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ రిస్క్ ప్రొఫెషనల్స్ (జీఏఆర్‌పీ) ఈ కోర్సును అందిస్తోంది. రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను దీని ద్వారా తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో వచ్చే రిస్క్‌లను ముందుగా ఊహించి వాటిని నిరోధించడానికి అవసరమైన నైపుణ్యాలను కోర్సులో తెలుసుకుంటారు. ఈ పరీక్ష మార్చి, నవంబరుల్లో నిర్వహిస్తారు. ఇందులో 2 భాగాలు ఉంటాయి. పార్ట్-1లో వంద మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వస్తాయి. పార్ట్-2లో 80 ప్రశ్నలు వస్తాయి. డిగ్రీ ఉత్తీర్ణులు దీనికి అర్హులు.

సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (సీఎఫ్‌పీ)
ఈ కోర్సును ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డు ఆఫ్ ఇండియా అందిస్తోంది. పెట్టుబడులకు సంబంధించి సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ కోర్సులో చేరినవారు ప్రిలిమినరీలో భాగంగా 4 పేపర్లు పూర్తిచేయాలి. అనంతరం అడ్వాన్స్‌డ్ (ఫైనల్) పరీక్షలు రాసుకోవచ్చు. ప్రిలిమినరీలో ఒక్కో పేపర్‌లో 77 చొప్పున మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వస్తాయి. అడ్వాన్స్‌డ్‌లో 5 మాడ్యూల్స్‌లో కేస్ స్టడీ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 15 ప్రశ్నలు వస్తాయి. గ్రాడ్యుయేట్లు ఎవరైనా సీఎఫ్‌పీ చేయవచ్చు.

ఫైనాన్షియల్ మోడలింగ్ అండ్ వాల్యుయేషన్ అనలిస్ట్
కార్పొరేట్ ఫైనాన్స్ సంస్థ (సీఎఫ్‌ఐ) ఈ సర్టిఫికేషన్‌ను అందిస్తోంది. ఆర్థిక నమూనాలు, విశ్లేషణల్లో సమర్థ పరిజ్ఞానం సొంతం చేసుకోవడానికి దీన్ని ఎంచుకోవచ్చు. పలు ఆన్‌లైన్ పరీక్షలు, అసైన్‌మెంట్లలో చూపిన ప్రతిభ ద్వారా సర్టిఫికేషన్ అందిస్తారు. ప్రతి పరీక్షలోనూ కనీసం 80 శాతం స్కోర్ సాధించాలి. ఏ డిగ్రీ చేసిన వారైనా పరీక్ష రాసుకోవచ్చు. ఇందులో 12 కోర్సులు ఉంటాయి. వీటిలో 9 అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. మిగతా మూడింటిని 6 ఎలక్టివ్స్ నుంచి ఎంపిక చేసుకోవచ్చు.

సర్టిఫైడ్ ఇంటర్నల్ ఆడిటర్ (సీఐఏ)
ఈ సర్టిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్స్ (ఐఐఏ) అందిస్తోంది. ఇంటర్నల్ ఆడిటర్‌గా రాణించడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. దీనిద్వారా ఇంటర్నల్ ఆడిటింగ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలను నేర్చుకోవచ్చు. పరీక్షలో 3 విభాగాలుంటాయి. పార్ట్-1లో ఇంటర్నల్ ఆడిటింగ్ బేసిక్స్ నుంచి 125 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్-2లో వంద ప్రశ్నలు ఇంటర్నల్ ఆడిటింగ్ ప్రాక్టీస్‌పై ఉంటాయి. పార్ట్-3లో వంద ప్రశ్నలు ఇంటర్నల్ ఆడిటింగ్ పరిజ్ఞానానికి సంబంధించిన అంశాల నుంచి వస్తాయి.

ఇన్వెస్ట్‌మెంట్ అనలిస్ట్
అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనలిస్ట్స్ (ఏసీఐఐఏ) దీన్ని అందిస్తోంది. భారత్‌లో ఈ పరీక్షలను అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇండియా (ఏఐడబ్ల్యుఎంఐ) నిర్వహిస్తోంది. దీన్ని పూర్తి చేస్తే అంతర్జాతీయ, జాతీయ పెట్టుబడుల విధివిధానాలపై అవగాహన ఏర్పడుతుంది. ఫైనాన్స్ విభాగంలో సేవలు అందించాలనుకునేవారు ఈ కోర్సు చేయవచ్చు. పరీక్షలో మూడు స్థాయులుంటాయి. అవి ప్రాథమిక, ఫైనల్, నేషనల్. పని అనుభవం ఉన్న గ్రాడ్యుయేట్లకు ఫౌండేషన్ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. ఫైనల్ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు.

మెర్జర్ అండ్ అక్విజిషన్ అడ్వైజర్
ఈ సర్టిఫికేషన్‌ను అలియన్స్ ఆఫ్ మెర్జర్ అండ్ అక్విజిషన్ అడ్వైజర్స్ (ఏఎం అండ్ ఏఏ) అందిస్తోంది. షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్లలో అత్యంత అడ్వాన్స్‌డ్ స్థాయిగా దీన్ని చెప్పుకోవచ్చు. మిడిల్ మార్కెట్ అడ్వైజరీ, ఫైనాన్స్, ట్రాన్సాక్షన్ సర్వీసుల్లో పరిజ్ఞానాన్ని ఈ కోర్సు అందిస్తుంది. డిగ్రీ అర్హత ఉన్నవారెవరైనా చేయవచ్చు.
సర్టిఫైడ్ ట్రెజరీ ప్రొఫెషనల్ (సీటీపీ)
ఈ సర్టిఫికేషన్‌ను అసోసియేషన్ ఫర్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ (ఏఎఫ్‌పీ) అందిస్తోంది. క్యాపిటల్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, కార్పొరేట్ లిక్విడిటీలపై పరిజ్ఞానం సొంతం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. ఏదైనా డిగ్రీతోపాటు కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.

సర్టిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఎనలిస్ట్ (సీఐఎంఏ):
ఈ సర్టిఫికేషన్‌ను ఇన్వెస్ట్‌మెంట్ అండ్ వెల్త్ ఇన్‌స్టిట్యూట్ అందిస్తోంది. ఫైనాన్సియల్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ అండ్ అనాలసిస్‌లో ఇది ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన సర్టిఫికేషన్. దీని ద్వారా ఆర్థిక అంశాల్లో థియరీతోపాటు అనువర్తిత పరిజ్ఞానమూ సొంతమవుతుంది. పట్టభద్రులు ఎవరైనా ఈ పరీక్ష రాసుకోవచ్చు.

సర్టిఫైడ్ ఫండ్ స్పెషలిస్ట్ (సీఎఫ్‌ఎస్):
దీన్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ (ఐబీఎఫ్) అందిస్తోంది. వివిధ రకాల ఫండ్‌లు, వాటిని ఎంపిక చేసుకోవడం, పెట్టుబడులకు సంబంధించిన విశ్లేషణను తెలుసుకోవడానికి ఈ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది. అందరు గ్రాడ్యుయేట్లు ఈ పరీక్ష రాసుకోవచ్చు.

సర్టిఫికేషన్లతో లభించే ప్రారంభ వార్షిక వేతనాలు, గరిష్ఠ హోదాలు
సర్టిఫికేషన్ | వేతనం రూ.లక్షల్లో | హోదాలు |
---|---|---|
సీఎంఏ | 3-20 | చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్,ఫైనాన్షియల్ కంట్రోలర్, ఫైనాన్స్ మేనేజర్ |
సీఐఏ | 3-19 | సీనియర్ మేనేజర్ ఆడిటర్, చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్, ఇంటర్నల్ ఆడిటింగ్ మేనేజర్ |
సీఎఫ్‌ఏ | 3-15 | అసోసియేట్ వీపీ ఫైనాన్షియల్ ఆపరేషన్స్, అసోసియేట్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ |
సీఎఫ్‌పీ | 2-7 | ఫైనాన్సియల్ ప్లానర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ |
సీఏఐఏ | 5-25 | ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వీపీ ఫైనాన్స్, సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్ |
సీఎంఖీఏఏ | 10-35 | చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, వీపీ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ |
సీఐఎంఏ | 3-24 | అసోసియేట్ వీపీ ఫైనాన్షియల్ ఆపరేషన్స్, అకౌంట్ మేనేజర్, అసిస్టెంట్ ఫైనాన్స్ మేనేజర్ |
ఎఫ్‌ఆర్‌ఎం | 6-20 | అసోసియేట్ వీపీ మార్కెట్ రిస్క్,బిజినెస్ అనలిస్ట్, రిస్క్ మేనేజర్. |
No Comment to " చిన్న కోర్సులు.. పెద్ద జీతాలు! "