ఏపీ పదోతరగతి ప్రశ్నపత్రంలో మార్పులు
ఏపీ పదోతరగతి ప్రశ్నపత్రంలో మార్పులు
ఏపీ పదోతరగతి ప్రశ్నపత్రంలో మార్పులు
* అంతర్గత మార్కుల తొలగింపు
ఈనాడు, అమరావతి: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల
ప్రశ్నపత్రాలు మారనున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న అంతర్గత మార్కులను తొలగించి
వాటి స్థానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈ ప్రశ్నల స్థాయిలోనూ మార్పులు
రానున్నాయి. దీనికి సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధమైంది. తాజా విధానంలో ఆరు
సబ్జెక్టులకు కలిపి 11 పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 10
మార్కులకు బిట్ పేపర్, మిగతా 40మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
తొలగించిన అంతర్గత 20 మార్కులకు పూర్తిగా ప్రశ్నలే ఇవ్వనున్నారు. బిట్
పేపర్‌లో ప్రస్తుతం 10 మార్కులకు 20 బిట్లు ఇస్తున్నారు. వీటిల్లో అన్నీ
బహుళైచ్ఛిక విధానంలోనే ఉంటున్నాయి. సమాధానాలు ఏ, బీ, సీ, డీగా ఉంటున్నాయి.
కొత్త విధానంలో ఇలాంటి ప్రశ్నలతోపాటు, ఖాళీల పూరింపు లాంటి వాటిని
ఇవ్వనున్నారు.
ప్రశ్నలు ఇలా.. ప్రశ్నపత్రంలోనూ మార్పులు తీసుకొస్తున్నారు. 40 మార్కులకు ఇచ్చే ప్రశ్నపత్రంలో ఒక మార్కు, రెండు, నాలుగు మార్కులకు ప్రశ్నలు ఇవ్వనున్నారు. ప్రశ్నల స్థాయిలోనూ మార్పు చేయనున్నారు. లాంగ్వేజెస్ విషయానికొస్తే నాలుగు మార్కుల ప్రశ్నల స్థానంలో ఐదు మార్కుల ప్రశ్నలు ఇవ్వనున్నారు.

No Comment to " ఏపీ పదోతరగతి ప్రశ్నపత్రంలో మార్పులు "