News Ticker

Menu

గ్రామ/వార్డ్ వాలంటీర్ల నియామకాలకు ప్రకటన

Apply For Grama/Ward Volunteer
(గ్రామ/వార్డ్ వాలంటీర్ కొరకు దరఖాస్తు చేసుకోండి)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1,84,498 మంది గ్రామ వాలంటీర్ల నియామకాలకు జిల్లాల కలెక్టర్లు జూన్ 23న‌ ప్రకటనలు (నోటిఫికేషన్‌) జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 21,600 మంది వాలంటీర్ల కోసం ప్రకటన వెలువడింది. 50 కుటుంబాలకో వాలంటీర్‌ చొప్పున జిల్లాల వారీగా లెక్కలు కట్టి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అవసరాన్ని బట్టి వాలంటీర్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో 50 కుటుంబాలు కూడా లేవని, అక్కడ వాలంటీర్ల నియామకం ఎలా చేపట్టాలన్న అంశంపై జిల్లా అధికారులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి సూచనలు కోరారు.
జిల్లా - వాలంటీర్ల సంఖ్య
శ్రీకాకుళం - 11,924
విజయనగరం - 10,012
విశాఖపట్నం - 12,272
తూర్పు గోదావరి - 21,600
పశ్చిమ గోదావరి - 17,881
కృష్ణా - 14,000
గుంటూరు - 17,550
ప్రకాశం - 14,106
నెల్లూరు - 10,000
చిత్తూరు - 15,824
కడప - 9,322
కర్నూలు - 16,000
అనంతపురం - 14,007
మొత్తం - 1,84,498!
వాలంటీరు పోస్టులకుదరఖాస్తు ఇలా!
ఒకటో దశ: ధ్రువీకరణ
* http://gramavolunteer.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ప్రాంతం, విద్యార్హత, పుట్టిన తేదీ ఆప్షన్లు సెలెక్ట్‌ చేసి ‘చెక్‌’ బటన్‌ క్లిక్‌ చేయాలి.
రెండో దశ: అభ్యర్థి ప్రామాణికం
* ఆధార్‌ నంబరు నమోదు చేసి ‘సెండ్‌ ఓటీపీ’ బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఆధార్‌కు లింక్‌ అయిన మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ నంబరు నమోదు చేసి ‘వెరిఫై ఓటీపీ’ బటన్‌ క్లిక్‌ చేయాలి. * ఆధార్‌ లేకుంటే మొబైల్‌ నంబరుతో రిజిస్ట్రేషన్‌ చేసుకొని ‘ఆధార్‌ నాట్‌ ఎవైౖల్‌బుల్‌’ బటన్‌ క్లిక్‌ చేయాలి. మరోసారి మొబైల్‌ నంబరు నమోదు చేసి ‘సెంట్‌ ఓటీపీ’ బటన్‌ క్లిక్‌ చేస్తే మొబైల్‌కి నంబరు వస్తుంది. దీన్ని నమోదు చేసి ‘వెరిఫై ఓటీపీ’ బటన్‌ క్లిక్‌ చేయాలి.
మూడో దశ: వ్యక్తిగత సమాచారం
* అభ్యర్థి పేరు, లింగం, తండ్రి పేరు, పుట్టిన తేదీ ఎంపిక చేసుకొని ‘వెరిఫై ఆధార్‌’ బటన్‌పై క్లిక్‌ చేయాలి. తరువాత దశలో ఫొటోను అప్‌లోడ్‌ చేసి బటన్‌పై క్లిక్‌ చేయాలి.
* చిరునామా నమోదు చేసి నివాస నిర్ధరణకు ఓటర్, రేషన్‌ కార్డు పీడీఎఫ్‌ ఫైల్‌ని అప్‌లోడ్‌ చేసి ‘ఎడిట్‌’ బటన్‌ క్లిక్‌ చేయాలి.
* తరువాత క్రమంలో మొబైల్‌ నంబరు నమోదు చేసి ‘సెండ్‌ ఓటీపీ’ బటన్‌ క్లిక్‌ చేయడంతో మొబైల్‌కి ఓటీపీ నంబరు వస్తుంది. దీన్ని నమోదు చేసి ‘వైరిఫై ఓటీపీ’ బటన్‌ క్లిక్‌ చేయాలి.
నాలుగో దశ: విద్యార్హత
* ఇంటర్మీడియట్‌ బోర్డు, విశ్వవిద్యాలయం, రిజిస్ట్రేషన్‌ నంబరు, ఉత్తీర్ణత గ్రేడ్, ఉత్తీర్ణులైన ఏడాది, వచ్చిన మార్కులు (శాతం), ఎడ్యుకేషన్‌ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్‌ చేసి ‘గో అండ్‌ కంటిన్యూ’ బటన్‌ క్లిక్‌ చేయాలి.
* గ్రామీణ ప్రాంతాలకు ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌; పట్టణ ప్రాంతాలకు ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ; గిరిజన ప్రాంతాలకు ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్లు జత చేయాలి.
అయిదో దశ: సామాజిక వివరాలు
* ఓసీ వర్గానికి చెందిన వారైతే రేడియో బటన్‌ ‘యస్‌’ ఎంపిక చేయాలి. అంగవైకల్యం లేనట్లయితే ‘నో’ ఎంపిక చేసుకోవాలి. డిక్లరేషన్‌ సెలెక్ట్‌ చేసుకొని ‘అప్లై’ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
* ఓసీ వర్గానికి చెందని వారైతే రేడియో బటన్‌ ‘నో’ సెలెక్ట్‌ చేయాలి. కుల ధ్రువీకరణ పత్రం ఐడీని నమోదు చేసి ‘వెరిఫై డీటైల్స్‌’ బటన్‌ క్లిక్‌ చేస్తే అభ్యర్థి వివరాలు ప్రదర్శితమవుతాయి. ‘చూజ్‌ ఫైల్‌’ బటన్‌పై క్లిక్‌ చేసి సర్టిఫికెట్‌ను ఎంపిక చేసుకొని ‘అప్‌లోడ్‌’ బటన్‌ క్లిక్‌ చేయాలి.
* అంగ వైకల్యం కలిగి ఉంటే రేడియో బటన్‌ ‘యస్‌’ ఎంపిక చేసుకోవాలి. వైకల్యం రకం, ధ్రువీకరణ ఐడీని నమోదు చేసి ‘చూజ్‌ ఫైల్‌’ బటన్‌పై క్లిక్‌ చేసి సర్టిఫికెట్‌ని ఎంపిక చేసి ‘అప్‌లోడ్‌’ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
* అన్ని వివరాలూ పూర్తి చేశాక ‘అప్లై’ బటన్‌ క్లిక్‌ చేస్తే దరఖాస్తు విజయవంతమై ఐడీ నంబరు వస్తుంది.
Download G.O                      Telugu UserManual

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " గ్రామ/వార్డ్ వాలంటీర్ల నియామకాలకు ప్రకటన "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM