Teacher and Graduates Constituency Forms for AP legesilative Council
శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల
శాసన మండలి ఎన్నికల షెడ్యూల్
విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 3 ఎమ్మెల్సీ స్థానాల నుంచి ఎన్నికైన
ఎమ్మెల్సీల పదవీ కాలం 2019 మార్చి 29 తో పూర్తి కానుంది. ఉభయ గోదావరి
జిల్లాలు, కృష్ణా - గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గాలకు ఉత్తరాంధ్ర
ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం
చేస్తోంది. దీంతో ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్
ప్రకటించింది.
- ఓటర్ల జాబితా కోసం అక్టోబరు 1న తొలి ప్రకటన విడుదల.
- నవంబరు 6 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించారు
- 2019 జనవరి 1న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనున్నారు.
- జనవరి నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం కల్పించారు.
- 2019 ఫిబ్రవరి 20న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు.
No Comment to " Teacher and Graduates Constituency Forms for AP legesilative Council "