News Ticker

Menu

1190 కేంద్రీయ విద్యాలయాల్లో 8339 పోస్టులు

1190 కేంద్రీయ విద్యాలయాల్లో 8339 పోస్టులు 

 
* కే‘వీఐపీ’ కావాలంటే..! 

కేంద్రీయ విద్యాలయాల టీచర్‌ పోస్టులంటే సమర్థతకూ, సంతృప్తికీ పట్టం కట్టేవి. ఆ వీఐపీ తరహా కొలువులు ఇప్పుడు ఉపాధ్యాయ శిక్షణ పొందినవారిని స్వాగతిస్తున్నాయి! ప్రతిష్ఠాత్మకమైన ఈ కేవీల్లో ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ పోస్టుల దగ్గర్నుంచి పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ) ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ), ప్రైమరీ టీచర్లు (పీఆర్‌టీ), లైబ్రేరియన్లు మొదలైన ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. సహజంగానే తీవ్రంగా పోటీ ఉండే వీటిని దక్కించుకోవాలంటే ఏం చేయాలి? ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే రాతపరీక్షలో నెగ్గటానికి ఎలా ముందడుగు వేయాలి?
స్వయంప్రతిపత్తితో నడిచే సంస్థలు కేంద్రీయ విద్యాలయాలు. కేంద్రప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. ప్రస్తుత నోటిఫికేషన్‌ ద్వారా 1190 కేవీల్లో కొలువులను భర్తీ చేస్తారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపుకోవాల్సివుంటుంది. దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌ ఇప్పటికే ప్రారంభమయింది. సెప్టెంబరు 13లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ పోస్టులకు రూ.1500, మిగిలిన ఉద్యోగాలకు రూ.1000 ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. ఫీజులో ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు సడలింపు ఉంది.
ప్రిన్సిపల్‌ పోస్టులకు 50 ఏళ్లు, వైస్‌ ప్రిన్సిపల్‌- 45, పీజీటీ-40, టీజీటీ-35, లైబ్రేరియన్‌-35, ప్రైమరీ టీచర్‌ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
వెబ్‌సైట్‌:www.kvsangathan.nic.in
దేశవ్యాప్తంగా 36 నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడ, పొరుగు రాష్ట్రాల్లో బెంగళూరు, చెన్నై, మధురై, మంగళూరులో పరీక్ష కేంద్రాలుంటాయి. ఎంపికైనవారిని (ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ ఉద్యోగాలు తప్ప) దేశంలోని 6 జోన్లలో దేనిలోనైనా నియమిస్తారు. ఉద్యోగాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు జోన్‌ను ప్రాధాన్యం ప్రకారం ఎంచుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మొదట సౌత్‌ జోన్‌లోని రాష్ట్రాలకూ, తర్వాత ఇతర జోన్‌లకూ ప్రాధాన్యమివ్వడం సముచితం.
ముఖ్య గమనిక: పీజీటీ (అన్ని సబ్జెక్టులు), టీజీటీ (అన్ని సబ్జెక్టులు)లకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అన్ని కేటగిరీల ఉపాధ్యాయ ఉద్యోగాలకు బహుళైచ్ఛిక ప్రశ్నల విధానంలో 2.30 గంటల్లో 150 మార్కులకు రాతపరీక్ష రాయాల్సి ఉంటుంది. మౌఖిక పరీక్ష 60 మార్కులకు ఉంటుంది. రాతపరీక్ష, మౌఖిక పరీక్షల మార్కులను ఎంపిక కోసం 85 : 15 నిష్పత్తిలో పరిగణనలోకి తీసుకుంటారు. ప్రైమరీ టీచర్‌ (మ్యూజిక్‌) ఉద్యోగాల కోసం పర్‌ఫార్మెన్స్‌ టెస్ట్‌ ఉంటుంది. వీరికి రాతపరీక్ష, నిష్పాదన పరీక్ష, మౌఖిక పరీక్ష వెయిటేజ్‌ 60 : 25 : 15 విధానంలో ఉంటుంది.
ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌
ఈ పోస్టులకు జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ హిందీ, జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ లిటరసీ, ఒక్కొక్కటి పది మార్కుల చొప్పున 50 మార్కులకు, ఎడ్యుకేషన్‌ 50 మార్కులకు, అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ఫైనాన్స్‌కు సంబంధించి 50 మార్కులకు రాతపరీక్ష రాయాల్సి ఉంటుంది.
ప్రధానంగా ఎడ్యుకేషన్‌లో విస్తృతంగా వివిధ అంశాలను అభ్యసించాలి. వివిధ వికాస దశలు, పరిశీలన, ఇంటర్వ్యూ, కేస్‌స్టడీ, ప్రయోగ పద్ధతులు, అభ్యసనను అవగాహన చేసుకోవడం, అభ్యసన సిద్ధాంతాలు మొదలైనవి. అడ్మినిస్ట్రేషన్‌, ఫైనాన్స్‌ కోసం సీసీఏ, టీఏ రూల్స్‌, ఎల్‌టీసీ రూల్స్‌, మెడికల్‌ అటెండెన్స్‌, పెన్షన్‌, జీఎఫ్‌ఆర్‌ పర్చేజ్‌ విధానం, ఇన్‌కమ్‌ టాక్స్‌-జీఎస్టీ అంశాలపై పట్టు పెంచుకోవాలి.
జనరల్‌ ఇంగ్లిష్‌, హిందీ విషయాల్లో భాషపై అవగాహన సామర్థ్యం, సాధారణ వ్యాకరణ అంశాలను పరీక్షిస్తారు. జీకే, వర్తమాన అంశాల్లో వివిధ రంగాల సమన్వయానికి చెందిన జ్ఞానం ముఖ్యం. రీజనింగ్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ లిటరసీకి సంబంధించి నెట్‌, ఏపీసెట్‌, టీఎస్‌సెట్‌ గత ప్రశ్నపత్రాల ఆధారంగా ముఖ్యమైన కాన్సెప్టులను ఎంచుకుని తయారవ్వాలి.
కంప్యూటర్‌ లిటరసీలో మెమరీ, కంప్యూటర్‌ తరాలు, ఇంటర్నెట్‌ మొదలైన అంశాల బేసిక్స్‌ ప్రధానం. ఎడ్యుకేషన్‌ సబ్జెక్ట్‌కు సంబంధించి సీటెట్‌, ఏపీటెట్‌, టీఎస్‌టెట్‌ సిలబస్‌లోని చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజీ మెటీరియల్‌ దోహదపడుతుంది.
* పార్ట్‌-1, 2; పార్ట్‌-3, పార్ట్‌-4 ఒక్కొక్కటి 50 మార్కుల చొప్పున కాబట్టి అన్నింటికి సమప్రాధాన్యం ఇవ్వాలి. సమయపాలన అవసరం. ఇప్పటికే మంచి అవగాహన ఉన్న సబ్జెక్టు సమయాన్ని, మిగతా విషయాలకు కేటాయించి, అన్ని విభాగాల్లో దృష్టి కేంద్రీకరించడం ఉత్తమం.
పీజీటీ
పార్ట్‌-1లో జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ హిందీ, జీకే, కరెంట్‌ అఫైర్స్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ లిటరసీ ఒక్కొక్కటి 10 మార్కుల చొప్పున 50 మార్కులకు, బోధనా విధానాలు 20 మార్కులకు, సంబంధిత సబ్జెక్ట్‌ 80 మార్కులకు... మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది.
బోధనా విధానాల్లో కరికులమ్‌ సూత్రాలు, ఉపగమాలు, వార్షిక, యూనిట్‌ పాఠ్యప్రణాళికలు, పాఠ్యపుస్తకం- లక్షణాలు, ప్రయోగశాల, గ్రంథాలయం, క్లబ్‌, మ్యూజియం, సమాచార సాంకేతికత, మూల్యాంకనం, సాధనాలు అభ్యసించాలి.
గమనిక: సంబంధిత సబ్జెక్ట్‌ను పీజీ స్థాయిలో ప్రాథమిక భావనలు విస్మరించుకుండా విశ్లేషణాత్మకంగా అభ్యసిస్తూ, సాధన చేయాలి.
టీజీటీ
వీరికి సంబంధిత సబ్జెక్ట్‌పై కాకుండా, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ హిందీ, కంప్యూటర్‌ లిటరసీ ఒక్కొక్కటి 10 మార్కుల చొప్పన 30 మార్కులు, జీకే, కరెంట్‌ అఫైర్స్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, పెడగాజీ ఒక్కొక్కటి 40 మార్కుల చొప్పున 120 మార్కులు కలిపి మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. సాధారణంగా జనరల్‌ ఇంగ్లిష్‌, హిందీ, సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రామాణికంగా సెకండరీ పాఠశాల స్థాయిలో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది.
జీకే, కరెంట్‌ అఫైర్స్‌, వివేచన సామర్థ్యానికి సంబంధించి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లు నిర్వహించే సిలబస్‌ను దృష్టిలో ఉంచుకోవాలి. ఆ టాపిక్స్‌ ప్రధాన అంశాలను సాధన చేయాలి.
పెడగాజికి సంబంధించి ప్రతి అంశాన్నీ సిలబస్‌ ఆధారంగా అధ్యయనం చేయాలి. ప్రధానంగా బీఈడీ, సిలబస్‌లోని ఎడ్యుకేషనల్‌ సైకాలజీ, టీచింగ్‌ మెథడ్స్‌ ప్రాథమిక అంశాలు నేర్చుకుంటూ, అభ్యసించాలి. సెక్షన్ల వారీగా ప్రిపరేషన్‌ పూర్తిస్థాయిలో కొనసాగించాలి. కొత్త తరహా ప్రశ్నలు గమనించినా సమాధానాలు రాసేవిధంగా సన్నద్ధత ఉండాలి. పోటీపరీక్ష కాబట్టి అన్ని విభాగాలకు ప్రాధాన్యమివ్వాలి. అప్లికేషన్‌ ఓరియంటేషన్‌లో ప్రశ్నలుండే అవకాశం ఉందని గ్రహించాలి.
ప్రైమరీ టీచర్‌
ప్రైమరీ టీచర్ల సిలబస్‌లో కూడా మిగతా కేటగిరీలో మాదిరే జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ హిందీ, జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ లిటరసీ ఒక్కోటి 10 మార్కుల చొప్పున మొత్తం 50 మార్కులకు రాయాల్సి ఉంటుంది. పెడగాజీ 20 మార్కులకు, సంబంధిత సబ్జెక్టు 80 మార్కులకు కలిపి మొత్తం 150 మార్కులకు రాతపరీక్ష రాయాలి.
పెడగాజీ విభాగంలో బాల్యం- బాల్యాభివృద్ధి, భౌతిక - చలన వికాసం, సాంఘిక, ఉద్వేగ వికాసం, విద్యాప్రణాళిక, అభ్యసనం, బోధనాభ్యసన ప్రక్రియ, సమాచార - సాంకేతిక విజ్ఞానం, భాషావగాహన, ప్రాథమిక పాఠశాలలో గణితవిద్య, శ్రవణం, భాషనం, పఠనం, లేఖనం, భాష-సమాచారం, బోధన ప్రణాళిక - తరగతిగది నిర్వహణ, లింగ భేదం, సహిత విద్య, ప్రత్యేక అవసరాల పిల్లలు- పాఠశాల - సమాజం మొదలైనవాటిపై పట్టు పెంచుకోవాలి.
ఈ అంశాలన్నీ డీఈడీ, / డీఈ/ఎడ్‌ స్థాయి సిలబస్‌లో సమగ్రంగా అందుబాటులో ఉంటుంది. సిలబస్‌ ప్రకారం పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలి. ప్రాథమిక భావనలతోపాటు, విషయావగాహన అవసరం.
కలిపి అడిగితే... తడబడకూడదు
సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించకుండా సన్నద్ధత మొదలుపెట్టకూడదు. పరీక్ష దృష్ట్యా ప్రధానమైన విభాగాలకు సంబంధించి అవగాహన ఏర్పరచుకోవాలి. ‌
* రెండు మూడు టాపిక్‌ల్లోని అంశాలను సమన్వయం చేసి ప్రశ్నలు అడగవచ్చు. దీనికి కంగారుపడకూడదు. ఇలాంటి ప్రశ్నలకు తగినవిధంగా సమాధానాలు నేర్చుకోవడం అవసరం.
* పాఠ్యపుస్తకంలో లేని, టాపిక్‌ రిలేటెడ్‌ ప్రశ్నలు రావొచ్చు. వీటికి సమాధానాలు రాయడానికి ప్రామాణిక మెటీరియల్‌ సేకరించుకుని అభ్యసించాలి.
* ఏ రోజు నిర్దేశించుకున్న సిలబస్‌ను ఆ రోజే పూర్తిచేసేలా శ్రద్ధ తీసుకోవాలి.
* చదివేటప్పుడు కొండ గుర్తులు, షార్ట్‌కట్‌లను తయారుచేసుకోవాలి.
* కష్టమనిపించిన సబ్జెక్టుకు ప్రణాళికలో ఎక్కువ సమయం కేటాయించటం సబబు. ఇలాంటి అంశాలను సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేయాలి. ‌
* మాతృభాషలో పాఠశాల దశ పూర్తిచేసినవారు ఆంగ్లం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆంగ్ల మాధ్యమ పుస్తకాలను చదవటం, ఆ భాషపై పట్టు సాధించటంపై దృష్టిపెట్టాలి. ‌
* ఆంగ్ల ప్రశ్నలకు సంబంధించి పదోతరగతి స్థాయిలోని అభ్యాసాలు చాలా ఉపయోగం. ‌
* సిలబస్‌లోని అన్ని టాపిక్‌లపై స్పష్టత పెంచుకోవాలి. ప్రధానమైన అంశాలు/ విభాగాలతోపాటు మిగతావి కూడా చదవాలి.
* గత ప్రశ్నపత్రాల సాధనతోపాటు మాదిరి ప్రశ్నపత్రాల సాధన ముఖ్యం. చేసిన తప్పులు సవరించుకోవడానికి పునరభ్యసనం, పునశ్చరణ ఉపయోగపడతాయి.
* ముఖ్యంగా రీజనింగ్‌ ఎబిలిటీ ప్రశ్నలకు మాదిరి ప్రశ్నలను ఉదాహరణల ఆధారంగా సాధన చేయాలి.
* నిర్దిష్ట సమయంలో కచ్చితంగా, వేగంగా సమాధానాలు రాస్తేనే విజయం సాధ్యమవుతుంది. అందుకు తగిన అభ్యాసం చేయాలి.
‌* పోటీపరీక్ష కాబట్టి ప్రతి ప్రశ్నా విలువైనదే. ప్రశ్నపత్రంలోని అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాసేలా ఆత్మవిశ్వాసంతో సన్నద్ధత కొనసాగించాలి.

న్యూదిల్లీలోని భార‌త మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ కేంద్రీయ విద్యాల‌య సంగ‌ఠన్.. దేశంలోని వివిధ కేంద్రీయ‌ విద్యాల‌యాల్లో బోధ‌నా ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
పోస్టు-ఖాళీల వివ‌రాలు:
1) ప్రిన్సిప‌ల్: 76
2) వైస్-ప్రిన్సిప‌ల్: 220
3) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్లు (పీజీటీ): 592
స‌బ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బ‌యాల‌జీ, హిస్ట‌రీ, జాగ్ర‌ఫీ, ఎక‌నామిక్స్‌, కామ‌ర్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌.
4) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్లు (టీజీటీ): 1900
స‌బ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్‌, సంస్కృతం, సైన్స్‌, మ్యాథ్స్‌, సోష‌ల్ స్ట‌డీస్‌, పీ&హెచ్ఈ, ఆర్ట్‌& ఎడ్యుకేష‌న్‌,డ‌బ్ల్యూఈటీ.
5) లైబ్రేరియ‌న్: 50
6) ప్రైమ‌రీ టీచ‌ర్లు: 5300
7) ప్రైమ‌రీ టీచ‌ర్లు(మ్యూజిక్): 201
మొత్తం పోస్టుల సంఖ్య‌: 8339
గ‌రిష్ఠ వ‌య‌సు: ప్రిన్సిప‌ల్ పోస్టుల‌కు 50 ఏళ్లు, వైస్ ప్రిన్సిప‌ల్- 45, పీజీటీ- 40, టీజీటీ- 35, లైబ్రేరియ‌న్‌- 35, ప్రైమ‌రీ టీచ‌ర్ పోస్టుల‌కు 30 ఏళ్లు మించ‌కూడ‌దు.
అర్హ‌త‌, ఎంపిక విధానం: స‌ంస్థ నిబంధ‌న‌ల ప్ర‌కారం.
రాతప‌రీక్ష‌: ఆఫ్‌లైన్‌లో ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 24.08.2018
ద‌ర‌ఖాస్తు చివ‌రితేది: 13.09.2018.

వెబ్‌సైట్‌: http://kvsangathan.nic.in/  

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " 1190 కేంద్రీయ విద్యాలయాల్లో 8339 పోస్టులు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM