ఉద్యోగులకు వాయిదాల పద్ధతిన (EMI) ఎలక్ట్రిక్ టూ వీలర్స్
వాయిదా పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రికల్ టూ వీలర్లు. డౌన్ పేమెంట్ లేదు.
🏍️సాధారణ ఉద్యోగి రోజుకు సగటున అర లీటరు చొప్పున నెలకు 15 లీటర్ల పెట్రోలు కొనేందుకు సుమారు రూ.1500 ఖర్చు చేయాల్సి వస్తోంది. విద్యుత్ వాహనానికి ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే మూడు యూనిట్లు ఖర్చవుతుంది. సుమారు 100 కి.మీ ప్రయాణించవచ్చు.
ఇంట్లోనే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పెట్రోలుకు వెచ్చించే మొత్తానికి ఇంకొంత కలిపితే నెల వాయిదా సరిపోతుంది.
👉Android App డౌన్లోడ్ కొరకు.
👉ఆన్ర్డాయిడ్ యాప్ లో ఎలా అప్లై చేయాలో పూర్తి వివరాలు.

ప్రతి నెలా రూ.2500 ఈఎంఐ చెల్లింపులకు ఏర్పాట్లు
ప్రభుత్వోద్యోగుల వేతనాల నుంచి ప్రతి నెలా రూ.2,500 ఈఎంఐ చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నది ఏపీ ప్రభుత్వం. ఈ రాయితీలతో ఆకర్షణీయమైన ధరలకు దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థల నుంచి ఉద్యోగులు ఈ ఎలక్ట్రిక్ స్కూటీలు, బైక్‌లను కొనుగోలు చేయవచ్చు.

మార్గదర్శకాలు..:
1). EMI అమౌంట్ ను ఉద్యోగి జీతం నుండి నెలనెెలా మినహాయించబడును.
2). ఉద్యోగి చేసిన స్వచ్ఛంద అభ్యర్థనపై టూవీలర్ అందజేయబడును.
3). 24 - 60 నెలల EMI కాలంతో 2,000 - 2,500 EMI అమౌంట్ తో ఎటువంటి పెట్టుబడి లేకుండా (జీరో ఇన్వెస్ట్మెంట్) టూవీలర్ ఇవ్వబడును.
4). ఆసక్తి ఉన్నవారు evnredcap మొబైల్ యాప్ (https://play.google.com/store/apps/details?id=com.evnredcap ) లేదా www.evnredcap.in పోర్టల్ లో అప్లై చేయాలి.
5). ఉద్యోగి దరఖాస్తు ఆధారంగా DDO గారు దరఖాస్తును ధృవీకరించాలి.
ఉద్యోగి యొక్క జీతం అర్హతను పరిశీలించినాక ఉద్యోగి నెలవారీ జీతం నుండి EMI ను మినహాయించే పత్రాన్ని DDO యొక్క ముద్ర, సంతకంతో పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
6). DDO గారు NREDCAP కు మినహాయించిన మొదటి EMI ఆధారంగా ఉద్యోగికి టూవీలర్ ను మంజూరు చేసి డెలివరీ చేయబడును.
 Join My whatsapp Group
 Join My whatsapp Group 
 
No Comment to " ఉద్యోగులకు వాయిదాల పద్ధతిన (EMI) ఎలక్ట్రిక్ టూ వీలర్స్ "