News Ticker

Menu

విద్యార్థులందరికీ విద్యాకానుక

 ♦విద్యార్థులందరికీ విద్యాకానుక

 1 నుంచి పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయం
కిట్ల రూపంలో ఆరు వస్తువులు
ఆగస్టు నెలాఖరుకు ఎంఆర్సీలకు అందజేత

 ❇️రాష్ట్రంలో ప్రభుత్వ
పాఠశాలల విద్యార్థులకు 'జగనన్న విద్యా కానుక రూపంలో ఆరు రకాల వస్తువులను అందజేసేందుకు విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది.

❇️ఒకటి నుంచి పదో
తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ
ప్రభుత్వం ఈ కిట్లను అందజేయనుంది.

 ❇️ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాణ్యతలో ఎటు
వంటి రాజీ లేకుండా అత్యంత పారదర్శకమైన పద్ధతిలో ఇటీవల విద్యాశాఖ
టెండర్లు ఖరారు చేసింది.

❇️ఈ నేపథ్యంలో
టెండర్లు పొందిన సంస్థలు వివిధ వస్తువులను ఇప్పటికే జిల్లాలకు పంపిణీ చేయడం
ప్రారంభిం చింది.

❇️సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆగస్టు చివరికల్లా రాష్ట్రంలోని అన్ని
ఎంఆర్సీ మండల రిసోర్స్ సెంటర్) కేంద్రాలకు ఈ
కిట్లను అందజేయాలని నిర్ణయించారు.

🎯ఎంఆర్సీల నుంచి పాఠశాలలకు..

❇️రాష్ట్రంలోని ప్రతి మండలంలో ఉన్న ఎంఆర్సీ లకు విద్యాకానుక కిట్లను చేర్చి భద్రపరచనున్నారు.

❇️విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే.. మండలాల
వారీగా ఎంఆర్సీల నుంచి కిట్లను పాఠశాలల ప్రధానోధ్యాయులకు అందజేయనున్నారు.

 ❇️మరోవైపు కరోనా
విజృంభణ నేపథ్యంలో పాఠశాలలను తెరవడంపై
కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ విడుదల చేసిన
మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

❇️కరోనా కారణంగా విద్యార్థులు అకడమిక్ ఇయర్
నష్టపోకుండా ఉండేలా చూడాలని విద్యాశాఖ
ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

🎯42 లక్షల మంది విద్యార్థులకు కిట్లు

❇️రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థుల సంఖ్య ఆధారం గా, కొత్తగా అడ్మిషన్లు తీసుకునే వారి సంఖ్యను అంచనా వేసి మొత్తం 42 లక్షల జగనన్న
విద్యాకానుక కిట్లను సిద్ధం చేస్తున్నారు.

❇️జిల్లాల వారీగా,
మండలాల వారీగా, ఆయా యాజమాన్యాల పరిధిలో
ఉన్న పాఠశా లలు, విద్యార్థుల సంఖ్యను ఇప్పటికే అంచనా
వేశారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ కిట్లకు సంబంధించిన అంచనాలు, ప్రతిపా దనలు పూర్తి చేశారు.

 ❇️రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 వేల పాఠశాలలుండగా.. వాటన్నింటికీ అందించాల్సిన కిట్లను మండలాల వారీగా ఎంఆర్సీలకు పంపిణీ
చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసే జగనన్న విద్యాకానుక కిట్లలో ఆరు రకాల వస్తువులు ఉండనున్నాయి.

❇️విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, నోట్ బుక్స్, షూస్, సాక్స్, బెల్ట్, బ్యాగ్,
టెక్స్ట్ బుక్స్ కిట్ల రూపంలో అందజేయనున్నారు.

 ❇️తరగతుల వారీగా విద్యార్థుల సంఖ్యను బట్టి ఎంఆర్సీల్లో కిట్లను సిద్ధం చేయనున్నారు.

❇️విద్యార్ధులకు నేవీ బ్లూ రంగు యూనిఫాం, విద్యార్థినులకు స్కై బ్లూ రంగు
యూనిఫాం అందజేయాలని ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో నిర్ణయించిన
విషయం తెలిసిందే.

❇️ఈ నేపథ్యంలో కిట్లను సిద్ధం చేసి మండలాలవారీగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

❇️ఒకటి నుంచి మూడోతరగతి విద్యార్థులకు చిన్న బ్యాగ్, 4- 6వ తరగతుల విద్యార్ధులకు మీడియం సైజ్, 7
నుంచి పదో తరగతి విద్యార్థులకు పెద్ద సైజ్ బ్యాగు అందిస్తారు.

❇️ప్రతి జిల్లాకు రాష్ట్ర కార్యాలయం నుంచి
నియమించిన అధికారి నేతృత్వంలో కిట్ల పంపిణీ పర్యవేక్షణ జరగనుంది.

 ❇️మరోవైపు కిట్ల సరఫరరా, పంపిణీ వివరాలను అన్ని స్థాయిల్లో వెబ్ సైట్లలో నమోదు చేయాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు పంపిణీ కూడా
ప్రారంభం కాగా.. ఆగస్టు నెలాఖరుకు ఎంఆర్సీ కేంద్రాల్లో అందాబాటులో ఉంచనున్నారు.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " విద్యార్థులందరికీ విద్యాకానుక "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM