6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు
6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి
విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా అవకాశం
కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్
జగన్‌హోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి
వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం
కాదని, అది విద్యార్థులకు, అధికారులకు కూడా మంచిది కాదని మంత్రి తెలిపారు.
ఈనెల 31న జరిగే సమీక్ష తరువాత పదోతరగతి పరీక్షలు షెడ్యూల్‌ను విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. దీనిపై విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని సూచించారు. కాగా కరోనా వైరస్ రిత్యా పాఠశాలలు మూతపడి ఉన్నందున పిల్లకు నేరుగా వారి ఇళ్లకే మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. వాలంటీర్ల ద్వారా విద్యార్థులకు మధ్యాహ్యా భోజనాన్ని అందించనున్నార
Join My whatsapp Group
























No Comment to " 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు "