News Ticker

Menu

SSC MARCH-2020 NOMINAL ROLLS మార్గదర్శకాలు.

SSC MARCH-2020  NOMINAL ROLLS మార్గదర్శకాలు.

IMG_20191118_213516

    28.12.2019 తేదీన Director General for Govt Exams   వారు నిర్వహించిన ప్రత్యేక అత్యవసర సమావేశం లో ఇచ్చిన ఆదేశాలు.
    వివిధ కారణాల వలన Child Info లోనికి 10వ తరగతి విద్యార్థుల పూర్తి వివరాలు(తద్వారా NOMINAL ROLLS లో ) కనిపించక పోవడం వలన గౌరవ DGE గారు పంపించిన వివిధ ప్రొఫార్మాలలో అటువంటి విద్యార్థుల పూర్తి డేటాను సంబంధిత ప్రధానోపాధ్యాయులు AC మరియు ఉపవిద్యాశాఖాధికారులకు 30/12/2019 (సోమవారం ) లోపు Submit చేయవలెను.
సాధారణ ఆదేశాలు
1. రాష్ట్రంలో 10 వ తరగతి చదువుతున్న ప్రతీ విద్యార్థి 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాయడానికి చర్యలు తీసుకోనవలెను.
2.ప్రధానోపాధ్యాయులు ఉప విద్యా శాఖాధికారులకు Nominal rolls ను సమర్పించ వలసిన అవసరం లేదు.
3.ఉప విద్యాశాఖాధికారులు,విద్యా శాఖాధికారులు అన్ని యాజమాన్యాల పాఠశాలలు మరియు విద్యార్థుల data ను preserve చేసుకోవలెను.
              క్రింది విషయముల వివరములు ఇవ్వబడిన ప్రొఫార్మాలో ప్రధానోపాధ్యాయులు ఉప విద్యాశాఖాధికారులకు, ఉప విద్యా శాఖాధికారులు విద్యా శాఖాధికారి ద్వారా DGE గారికి సమర్పించవలెను.
Child info కు సంబంధించిన విద్యార్థుల వివరాలు:
1.పాఠశాలలో చదువుతున్న 10 వ తరగతి విద్యార్ధి వివరాలు పూర్తిగా child info లో కనిపించక పోయినట్లైతే
2.పాఠశాలలో చదువుతున్న 10 వ తరగతి విద్యార్ధి యొక్క వివరాలు క్రింది తరగతులలో కనిపిస్తున్నట్లైతే
3.పాఠశాలలో చదువుతున్న విద్యార్ధి పేరు పూర్వ పాఠశాల child info లో ఉన్నట్లైతే
4.పక్క రాష్ట్రo నుండి ఇటీవల పాఠశాలలో చేరి child info లో నమోదు చేయడానికి వీలులేని విద్యార్ధి వివరాలు
5.తప్పుగా నమోదు చేయబడి విద్యార్థుల ఆధార్ నెంబర్ల వివరాలు
6.చలాన్ ల ద్వారా ఫీజు చెల్లించిన పాఠశాల వివరములు
7. 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో సబ్జెక్టు మినహాయింపు కోరుతున్న దివ్యాంగ విద్యార్థులయొక్క Original PHC  Certificates సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఉపవిద్యాశాఖాధికారులకు అందజేయవలెను
ఉపవిద్యాశాఖాధికారులు తక్షణమే ఆ Original PHC Certificates DGE కి పంపిన మీదట వారు తక్షణమే అటువంటి దివ్యాంగ విద్యార్థుల అర్హత మేరకు 10వ తరగతి పరీక్షల సబ్జెక్టులలో మినహాయింపు కలుగజేస్తారు. పై విధంగా చేయని యెడల సంబంధిత దివ్యాంగ విద్యార్థులకు SSC MARCH-2020 పబ్లిక్ పరీక్షలలో ఎటువంటి మినహాయింపు ఇవ్వబడదు.
8.పరీక్ష ఫీజుల చెల్లింపులలో తేడా ఉన్న సందర్భాలలో తక్షణమే సంబంధిత ఉపవిద్యాశాఖథికారులను సంప్రదించాలి.
             పైన తెల్పిన అన్ని మార్గదర్శకాలు సరిగా నమోదు చేసిన ప్రధానోపాధ్యాయులు వారి NOMINAL ROLLS తక్షణమే ONLINE లో SUBMIT చేసుకోగలరు.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " SSC MARCH-2020 NOMINAL ROLLS మార్గదర్శకాలు. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM