పాఠశాల విద్య విద్యార్థులలో మాతృభాష మీద పెంపొందించుట ద్వారా తెలుగు భాష పరిరక్షణ మరియు వ్యాప్తి - పాఠశాలల్లో క్విజ్ నిర్వహణ - ఆదేశాలు.
పాఠశాల విద్య విద్యార్థులలో మాతృభాష మీద పెంపొందించుట ద్వారా తెలుగు భాష పరిరక్షణ మరియు వ్యాప్తి - పాఠశాలల్లో క్విజ్ నిర్వహణ - ఆదేశాలు.
పాఠశాల విద్య విద్యార్థులలో మాతృభాష మీద పెంపొందించుట ద్వారా తెలుగు భాష పరిరక్షణ మరియు వ్యాప్తి - పాఠశాలల్లో క్విజ్ నిర్వహణ - ఆదేశాలు.
తెలుగు రాష్ట్రాల పదవ తరగతి విద్యార్థులు, వారి తెలుగు ఉపాధ్యాయులు, వారి పాఠశాల కూడా ₹ 1,00,000 వరకూ నగదు బహుమతులు, సత్కారాలు, ప్రశంసా పత్రాలు, ఇంకా తెలుగు ప్రజలు ₹ 100,000 విలువైన బహుమతులు గెలుచుకునే సువర్ణ అవకాశానికి స్వాగతం.
1. పోటీ ఎందుకు?
తెలుగు భాషకు ఆలంబన తెలుగు సాహిత్యం. ఈ ఆధునిక యుగంలో ఆ సాహిత్యాన్ని
సులువుగా ఆస్వాదించడానికి, దాసుభాషితం శ్రవణ మాధ్యమంలో అందిస్తున్న విషయం
తెలిసిందే. అయితే తెలుగు సాహిత్యం పరిఢవిల్లడానికి భాషాభిమానం అవసరం. అది
పాఠశాల దశలోనే ఏర్పడితే జీవితాంతం ఉంటుంది.
ఒక విషయం మీద విద్యార్థులలో ఆసక్తి, ఆలోచన ప్రేరేపించడానికి పోటీలు చాలా
ఉపకరిస్తాయి. మాథ్స్ / సైన్స్ ఒలంపియాడ్ తరహాలో తెలుగుకీ ఒక పోటీ ఉండాలని
భావించి, ఈ పోటీ రూపకల్పన చేయడం జరిగింది.
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో కేవలం ఒక్కొక్క పాఠశాల మాత్రమే
విజేతగా నిలుస్తాయి. రెండవ మూడవ స్థానాలు ఉండవు.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల,
గురుకుల, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లోని పదవ తరగతి
విద్యార్ధులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు.
ఇందుకు నాలుగు కారణాలు.
1.మొదటిది, పోటీ రసవత్తరంగా ఉండాలంటే అందులోని ప్రశ్నలు, కొన్ని
సులువుగా, కొన్ని కఠినంగా సరైన మిశ్రమంలో విభిన్నంగా ఉండాలి.
పదవ తరగతి విద్యార్థులైతే ఎక్కువ పాఠ్యాంశాలని చదివి ఉంటారు కనుక,
వేర్వేరు అంశాలలో ప్రశ్నలు ఇవ్వడం ద్వారా ప్రశ్నావళిని ఆసక్తికరంగా
కూర్చవచ్చు.
2.రెండవది, గెలిచిన విద్యార్థులకు నగదు బహుమతి గణనీయమైన మొత్తంలో
ఉంది కనక పెద్ద తరగతి విద్యార్థులకు అది ప్రోత్సాహకరంగా ఉంటుంది.
3.మూడవది, ఈ పోటీ పూర్తిగా Online మాధ్యమం ద్వారా
నిర్వహించబడుతుంది. అంటే విద్యార్థికి కొంచెమైనా సాంకేతిక అవగాహన
తప్పనిసరి. పరిణితి రీత్యా పదవ తరగతి విద్యార్థులకు ఈ అవగాహన
ఉంటుంది.
4.నాల్గవది, పాఠశాలలో ఇదే తమ ఆఖరి విద్యా సంవత్సరం కాబట్టి, ఈ
పోటీలో గెలిస్తే తమ తెలుగు ఉపాధ్యాయులకు, పాఠశాలకు అది తగిన
గురుదక్షిణగా భావించి, విద్యార్థులు రెట్టింపు ఉత్సాహంతో
పాల్గొంటారు.
ADD ME IN YOUR WHAT'S APP GROUP FOR LATEST UPDATES MYNUMBER 8985727170
No Comment to " పాఠశాల విద్య విద్యార్థులలో మాతృభాష మీద పెంపొందించుట ద్వారా తెలుగు భాష పరిరక్షణ మరియు వ్యాప్తి - పాఠశాలల్లో క్విజ్ నిర్వహణ - ఆదేశాలు. "