కరోనా కోసం ప్లాస్మా చికిత్సకి గ్రీన్ సిగ్నల్

కరోనాకు చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు
ప్రపంచవ్యాప్తంగా వైద్యనిపుణులు, వైరాలజిస్టులు, భౌతిక శాస్త్రవేత్తలు
పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని మార్గాలను అన్వేషించారు.
అందులో ఒకటి ప్లాస్మా థెరపీ. ఇప్పుడు ప్లాస్మా థెరపీకి కేంద్రం కూడా
అనుమతించింది. ఈమేరకు కేరళకు ఐసీఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే
ప్లాస్మా థెరఫీపై పరీక్షలు నిర్వహిస్తోంది కేరళ . కరోనా నుంచి కోలుకున్న
వ్యక్తి నుంచి ప్లాస్మా సేకరించి రోగికి అందించే చికిత్సా విధానం ఇది.
గతంలో టాన్సిల్స్ కు ఇదే పద్ధతిలో చికిత్స అందించి విజయం సాధించారు. కరోనా
నుంచి కోలుకున్న వ్యక్తి యాంటీబాడీస్ తో ప్లాస్మా చికిత్స చేస్తారు.
కరోనా బారిన పడిన వాళ్లల్లో చాలా మంది కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారు. కరోనా రోగులు కోలుకోవడానికి వాళ్ల శరీరంలోని బలమైన యాంటీ బాడీస్ సహకరిస్తాయి. శరీరంలోని మంచి సూక్ష్మజీవులు, మంచి బ్యాక్టీరియా కరోనా నుంచి కోలుకోడానికి సహాయపడుతోంది. ప్లాస్మా చికిత్స విధానంలో...ఇలా కరోనా నుంచి కోలుకున్న వారి శరీరం నుంచి వారి అనుమతి మేరకు ఇలాంటి యాంటీ బాడీస్‌ను డాక్టర్లు సేకరించి కరోనా పాజిటివ్ రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు. రక్తం ఒకరి నుంచి ఒకరికి ఎక్కించే విధానంలోనే ఈ చికిత్స జరుగుతుంది.
1918లో ఫ్లూ జ్వరం మహమ్మారిలా వ్యాపించినప్పుడు దానికి ఆధునిక వైద్యం అందుబాటుకు రాలేదు. వైద్యులు అప్పుడు కోలుకున్న రోగుల ప్లాస్మాను వ్యాధిగ్రస్తుల రక్తంలోకి ఎక్కించి నయం చేశారు. 2002లో సార్స్ వచ్చినప్పుడు, 2014లో ఎబోలా వచ్చినప్పుడు కూడా ఇదే తరహా ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు కోవిడ్ 19 వైరస్‌కు కూడా ప్లాస్మా థెరపీ సమర్థంగా పనిచేస్తుందంటున్నారు వైద్యనిపుణులు. ఇలా చైనా, దక్షిణ కోరియాలో చికిత్స చేసిన పేషెంట్లకు నయం కాగా.. భారీ స్థాయిలో దాన్ని వాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలోనూ దీనిపై ప్రయోగాలు నిర్వహిస్తున్నారు

No Comment to " కరోనా కోసం ప్లాస్మా చికిత్సకి గ్రీన్ సిగ్నల్ "