News Ticker

Menu

ఆపరేషన్ కరోనా దేశంలోని ఆ 75 జిల్లాలు బంద్

ఆపరేషన్ కరోనా దేశంలోని ఆ 75 జిల్లాలు బంద్


కరోనాతో ప్రభావితమైన 75 జిల్లాల మూసివేతకు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల కరోనా కేసులు నమోదైన జిల్లాల్లో అత్యవసర సేవలు మినహా పూర్తి బంద్ పాటించాలని ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలు ఇచ్చింది. అంతరాష్ట్ర రవాణా సేవలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్​తో ప్రభావితమైన 75 జిల్లాల బంద్​కు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల స్థాయిలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. మార్చి 31వరకు రాష్ట్రాల మధ్య బస్సుల బంద్​కు పిలుపునిచ్చింది.
కరోనా వైరస్​తో ప్రభావితమైన 75 జిల్లాల బంద్​కు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల స్థాయిలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. మార్చి 31వరకు రాష్ట్రాల మధ్య బస్సుల బంద్​కు పిలుపునిచ్చింది.కరోనాతో ప్రభావితమైన 75 జిల్లాల్లో ఆంక్షలపై త్వరలో రాష్ట్రప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తాయని పేర్కొన్నారు అధికారులు. ఆ 75 జిల్లాల్లో అత్యవసర సేవలు మాత్రమే అందించాలని మార్గదర్శకాలు జారీ చేశారు.జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశం వేదికగా కేంద్రానికి నివేదించారు.
బలగాల తరలింపు రద్దు...
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 5వరకు సైనిక బలగాల తరలింపును రద్దు చేశారు అధికారులు. సెలవులు, ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 5 వరకు ఎక్కడివారక్కడే కొనసాగాలని స్పష్టంచేశారు.జవాన్లు అందరూ తమ కుటుంబసభ్యులు ఎవరూ విదేశాల్లో ప్రయాణించలేదన్న డిక్లరేషన్​ను సమర్పించాలని ఆదేశించారు అధికారులు. విదేశాల నుంచి వచ్చిన వారిని కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఆపరేషన్ కరోనా దేశంలోని ఆ 75 జిల్లాలు బంద్ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM