News Ticker

Menu

ఆన్ లైన్ లో ఆరోగ్య కార్డులు.. గుర్తింపు లేనివారికి అవకాశం.... నేరుగా దరఖాస్తుకు వీలు..

ఆన్ లైన్ లో ఆరోగ్య కార్డులు.. గుర్తింపు లేనివారికి అవకాశం.... నేరుగా దరఖాస్తుకు వీలు.. 

గుర్తింపు లేనివారికి అవకాశం....
నేరుగా దరఖాస్తుకు వీలు..
➧దరఖాస్తుకు అవసరమయ్యే వివరాలు ఇవే..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకం గుర్తింపు కార్డును ఇకపై ఆన్లైన్లో పొందవచ్చు.
➤ఉద్యోగి , వారిపై ఆధారపడే వారి వివరాలు ఇందులో నమోదై ఉంటాయి.
➤వీరిలో ఎవరైనా అనారోగ్యం పాలైనా ఆసుపత్రికి వైద్యం కోసం వెళితే ఈ కార్డును చూపించాల్సి ఉంటుంది.
➤గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఈ హెచ్ సీకి సంబంధిం చి ముగ్గురు ఉద్యోగులతో ఒక విభాగం ఉంది.
➤ఉద్యోగి ఈ విభాగంలో సంప్రదిస్తే వారు కార్డును ఆన్లైన్లో రాష్ట్ర కార్యాలయానికి పంపించి ఆమోదం పొందుతారు.
➤ఆ తర్వాత రోగిని ఆసుపత్రిలో చేర్చుకుంటారు.
➤వాస్తవానికి ఎనిమిదేళ్ల కిందట ఈ కార్డులు జారీ ప్రక్రియ చేపట్టినా ఆరేళ్లుగా చాలా మందికి కార్డులు లేవు .
➤ఉన్న వాట్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్నా జరగడం లేదు .
➤ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆరోగ్య కార్డులు ఆన్లైన్లో పొందడానికి అవకాశం ఇచ్చింది .
➤దీంతో కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది ఉద్యోగులకు తీరనుంది .
జత చేయాల్సినవి ఇవీ
ఎస్ఆర్ , ఫొటోలు.
➤పుట్టిన తేదీకి సంబందించి టెన్త్ ధ్రువీకరణ పత్రం.
➤ఉద్యోగిపై ఆధారపడిన వారి వివరాలు.
➤ఉద్యోగి తో ఉన్న సంబంధం పేర్కోవాలి.
➤అందరి ఆధార్ కార్డుల నెంబర్లు ఇవ్వాలి.
➤ఐదేళ్లలోపు పిల్లలుంటే వారి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం జతచేయాలి.
➤వికలాంగులు ఉంటే వారి వివరాలు
➤వైద్యులు ధ్రువీకరణ పత్రం.
➤జత చేసిన అన్ని పత్రాలు స్కానింగ్ చేసి పంపాలి.
ఆన్లైన్లో దరఖాస్తులకు అవసరమయ్యే వివరాలు ఇవీ . . .
కార్డు కోసం గుర్తింపు నెంబరు అంటే ట్రెజరీ అధికారులు కేటాయించిన గుర్తుంపు నెంబరు పొందుపర్చాలి . .
➤పింఛను పొందుతున్న వారైతే పీవోసీ పేరుతో ట్రెజరీ అధికారులు కేటాయించిన నెంబరు తీసుకోవాలి .
➤ఆ ఉద్యోగి సర్వీసు రిజిస్టర్ లో రాసిన పేరు ఆధార్ నెంబరు , ఎస్ఆర్ ప్రారంభ సమయంలో ఇచ్చిన గుర్తింపు ఐడీ ఉంచుకోవాలి.
➤ఎస్ఆర్లో రాసిన వివరాల ఆధారంగా పుట్టిన తేదీ , వైవాహిక స్థితి , కులం , జాతీయత , నివాసం , ఇంటి చిరునామ , ఈ - మెయిల్ ఐడీ , మొబైల్ నెంబరు ఇవ్వాలి .
➤కుటుంబ సభ్యుల్లో వికలాంగులు ఉంటే వారి వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలి .
➤రేషన్ కార్డ్ నెంబరు, టెన్త్ సర్టిఫికెట్ లో పేర్కొన్న రెండు పుట్టుమచ్చల వివరాలు తెలపాలి.
➤ఏ శాఖలో పనిచేస్తున్నారు , ఉద్యోగం వివరాలు , పేస్కేల్, ప్రస్తుతం పొందుతున్న వేతనం వివరాలు నమోదు చేయాలి .
నమోదు ఇలా . . .
ముందుగా ehs.gov.in అనే వెబ్ సైట్లో లాగిన్ అవ్వాలి.
➤ఆ ఉద్యోగి కోడ్ , User ID, వేతన చెల్లింపు అధికారి కేటాయించిన పాస్వర్డ్ ఉపయోగించాలి.
➤ఉద్యోగి పేరు నమోదు చేశాక ఆధార్ కార్డు నెంబరు నమోదు చేయాలి.
➤క్లిక్ హియర్ ఫర్ రిఫరెన్స్ ఆప్షన్ వచ్చాక అందులోనూ ఆ ధార్ నెంబర్లు నమోదు చేయాలి.
➤దరఖాస్తులో అన్ని వివరాలు నమోదు చేశాక తప్పులే మైనా ఉంటే వాటిని సరిచేసి మళ్లీ నమోదు చేయాలి.
➤ప్రింట్ కాపీపై సంతకం చేశాక ఆన్లై లో ఆప్లోడ్ చేయాలి.
➤ఆ వివరాలు నింపి సంతకం చేసిన దరఖాస్తు ప్రింటు వేతన చెల్లింపు అధికారికి అందజేయాలి.
➤ఉద్యోగి , కుటుంబ సభ్యుల ఫొటోలు , ఎస్ఆర్ మొదటి రెండు పేజీలు స్కాన్ చేసి దరఖాస్తుతో పాటు ఇవ్వాలి.
➤బయోమెట్రిక్ విధానంలో జీతాలు చెల్లించే అధికారికి దరఖాస్తు ఇచ్చిన ప్పుడు కుటుంబ సభ్యుల వేలిముద్రలు ఇవ్వాలి.
➤జీతం చెల్లించే అధికారికి అన్ని వివరాలు ఆధారాలతో అందించాక ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు అందినట్లు రశీదు తీసుకోవాలి.
➤అన్ని వివరాలు ఆన్ లైన్లో పొందుపర్చాక 15 రోజుల్లో కార్డు సిద్ధంగా ఉందన్న సమాచారం ఈ మెయిలకు లేదా ఫోన్ నెంబర్ కు వస్తుంది.

➽ Apply Now  ehs.ap.gov.in

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఆన్ లైన్ లో ఆరోగ్య కార్డులు.. గుర్తింపు లేనివారికి అవకాశం.... నేరుగా దరఖాస్తుకు వీలు.. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM