News Ticker

Menu

పాత సిలబస్‌పైనే నీట్ పీజీ?

 

NEET-PG | కేంద్రానికి సుప్రీం షాక్‌.. పాత సిలబస్‌పైనే నీట్ పీజీ?

NEET-PG | పీజీ వైద్యవిద్య, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌-పీజీ 2021 పరీక్షలో పాత సిలబస్‌నే పునరుద్ధరించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరీక్ష నిర్వహణలో కేంద్రం, జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీటీ)లపై అక్షింతలు వేసింది. పాత సిలబస్ ప్రకారం పరీక్ష నిర్వహించడంతోపాటు వచ్చే ఏడాదికి ఎంట్రన్స్ తేదీలను మార్చాలని ఆదేశించింది.

AYAH PAYMENT DETAILS REPORT 

నిర్ణయం పునఃపరిశీలనకు ఒకరోజు గడువు

ఈ అంశంపై బుధవారం కూడా విచారణ జరుగుతుందని న్యాయస్థానం తెలిపింది. దీంతో పాత సిలబస్‌తోనే నీట్ పీజీ నిర్వహణతోపాటు పరీక్షా తేదీలను మార్చే విషయమై తుది నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి కోర్టు ఒకరోజు గడువు ఇచ్చింది.

2021 - OPTIONAL HOLIDAYS LIST 

వైద్యవిద్య.. వైద్యవృత్తి వ్యాపారమయం చేస్తారా..

వైద్య విద్యాభ్యాసం, వైద్యవృత్తి నిర్వహణకు రూపొందించిన నిబంధనలు దాన్ని వ్యాపారంగా మార్చేలా ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తమకు అధికారం ఉందని యువ డాక్టర్లను ఫుట్‌బాల్ ఆడుకోవద్దని ఇంతకుముందు విచారణలో తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

దీనిపై సోమవారం కౌంటర్ దాఖలు చేసిన కేంద్రం.. సవరించిన సిలబస్‌తోనే నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. అయితే, విద్యార్థులు ప్రిపేర్ కావడానికి పరీక్షను రెండు నెలలు వాయిదా వేస్తామని వెల్లడించింది.

 PENSIONERS PAY SLIP

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " పాత సిలబస్‌పైనే నీట్ పీజీ? "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM