News Ticker

Menu

Aadhaar Card-PAN Card: పాన్‌ కార్డు- ఆధార్‌ కార్డు లింక్‌పై ​కేంద్రం కీలక ప్రకటన

 

Aadhaar Card-PAN Card: పాన్‌ కార్డు- ఆధార్‌ కార్డు లింక్‌పై ​కేంద్రం కీలక ప్రకటన

గత కొన్నిరోజుల నుంచి ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్‌లో తలెత్తిన సమస్యలతో పన్ను చెల్లింపుదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆదాయపన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. పాన్ కార్డును ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని కేం‍ద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది. పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేసే గడువు 2022 మార్చి 31. పాన్‌ కార్డును ఆదార్‌కార్డుతో లింక్‌ చేసే గడువును పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఒక ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కాస్త ఉపశమనం లభించనుంది. 

పాన్‌ కార్డును, ఆధార్‌తో అనుసంధాన గడువు పొడిగించడం ఇది నాలుగో సారి. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఆర్ధిక బిల్లులో ప్రభుత్వం కొన్ని సవరణలను చేసింది. కొత్త నిబందనల ప్రకారం ఒక వ్యక్తి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే రూ.1000 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పాన్‌-ఆధార్‌ లింకింగ్ పొడగింపు నిర్ణయంతో పాటు మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగి కొవిడ్‌ చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కూడా కేంద్రం పేర్కొంది.  

Imageమీ పాన్‌ కార్డును ఆధార్ కార్డుతో ఇలా లింక్ చేయండి..

  • ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ www.incometaxindiaefiling.gov.inకి లాగిన్ అవ్వండి.
  • 'లింక్ ఆధార్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి
  • సంబంధిత ఫీల్డ్‌లలో పాన్‌ నంబర్, ఆధార్ నంబర్, మీ పూర్తి పేరునమోదు చేయాలి.
  • తరువాత పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయండి
  • క్యాప్చా కోడ్‌ని ఎంటర్‌ చేసి, పేజీ దిగువన ఉన్న 'లింక్‌ ఆధార్‌' బటన్‌పై క్లిక్‌ చేస్తే మీ పాన్‌ కార్డు విజయవంతంగా ఆధార్‌ కార్డుతో అనుసంధానం జరిగినట్లు పాప్‌ఆప్‌విండో వస్తుంది. 
  •  

    Share This:

    Post Tags:

    teacherbook.in

    No Comment to " Aadhaar Card-PAN Card: పాన్‌ కార్డు- ఆధార్‌ కార్డు లింక్‌పై ​కేంద్రం కీలక ప్రకటన "

    • To add an Emoticons Show Icons
    • To add code Use [pre]code here[/pre]
    • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
    • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM