News Ticker

Menu

ఏపీలో రేపట్నుంచి విద్యా సంస్థలుకు సెలవులు

ఏపీలో రేపట్నుంచి విద్యా సంస్థలుకు  సెలవులు



  10th పరీక్షలు యథాతథం
               విద్యాశాఖామంత్రి

కరోనా వైరస్‌  ప్రభావం దేశంలో క్రమంగా పెరుగుతున్న వేళ  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ  మహమ్మారిని కట్టడిచేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. గురువారం (రేపు) నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్‌ సెంటర్లకు సెలవులు ప్రకటించింది. విద్యాశాఖ, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

COVID-19పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి YSజగన్ మోహన్ రెడ్డి..
నేటితో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో, COVID-19 వ్యాధి నియంత్రణలో భాగంగా విద్యాసంస్థలకు రేపటి నుండి కొన్ని రోజులు శలవులు ప్రకటించాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
పరిస్థితిని సమీక్షించి విద్యాసంస్ధలను తిరిగి ఎప్పటి నుండి ప్రారంభించాలనేది నిర్ణయిస్తామని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు..
*ప్రభుత్వ పాఠశాలలు,కాలేజీలు, యూనివర్శిటీలు,కోచింగ్ సెంటర్లు మూసివేయాలని ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం..

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఏపీలో రేపట్నుంచి విద్యా సంస్థలుకు సెలవులు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM