News Ticker

Menu

21 నుంచి మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెనూ

21 నుంచి మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెనూ
విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష
వివరాలు వెల్లడించిన మంత్రి ఆదిమూలపు సురేష్ గారు 
ADIMULAPU-SURESH-3

           రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల పైచిలుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈనెల 21 నుంచి నూతన మెనూ అమలవుతుందని వెల్లడించారు. అన్నిచోట్ల ఒకే రకమైన నాణ్యత, రుచి ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
              మధ్యాహ్న భోజన పథకం అమలులో నాలుగు అంచెలుగా తనిఖీలు ఉంటాయని మంత్రి తెలిపారు. తల్లిదండ్రుల కమిటీ, గ్రామ సచివాలయ సిబ్బంది, సెర్ప్‌ నుంచి తనిఖీలు ఉంటాయని అన్నారు. నాడు-నేడు, జగనన్న మధ్యాహ్న భోజన పథకం, మౌలిక వసతుల కల్పన ప్రతిష్టాత్మకంగా చేపడుతామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పులిహోరా,కిచిడి, వేరుశనగ చిక్కీ, గుడ్డు వంటి పౌష్టికాహారం అందిస్తామని మంత్రి అన్నారు.
వేరుశనగ చిక్కీ
IMG-20200107-WA0006
రాష్ట్రమంతా ఒకే రుచి !
విద్యార్థుల మధ్యాహ్న భోజనం నాణ్యతలో ఎవరూ రాజీ పడొద్దు
‘‘పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ఒకే విధంగా ఉండాలి. పులివెందులలో తిన్నా, అమరావతిలో తిన్నా రుచి మారకూడదు. నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడొద్దు’’ అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ఆయాలకు ఇచ్చే రూ.3 వేల వేతనం నుంచి సరుకులకు నగదు చెల్లింపుల వరకు అన్నీ గ్రీన్‌ చానెల్‌లోనే జరగాలని ఆదేశించారు. శనివారం విద్యాశాఖ కార్యకలాపాలపై సమీక్షించిన సీఎం జగన్‌.. అధికారులకు పలు సూచనలు చేశారు.
మధ్యాహ్న భోజనం తనిఖీ కోసం నాలుగు అంచెల విధానం అమలు చేయాలని సీఎం సూచించారు. భోజన నాణ్యత తనిఖీ, అభిప్రాయాలను తెలుసుకునేందుకు పేరెంట్స్‌ కమిటీలో ముగ్గురు తల్లులకు బాధ్యత అప్పగించాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కమిటీలో చోటు కల్పించాలని, పేరెంట్స్‌ కమిటీ కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యత పశీలించాలని, ఈ కమిటీలు నాడు-నేడు, పారిశుధ్యం కార్యక్రమాలను కూడా పరిశీలించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం కోసం ఏడాదికి రూ.1300 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు.
త్వరలో మొబైల్‌ యాప్‌...
మధ్యాహ్న భోజన పథకం కోసం మొబైల్‌ యాప్‌ రూపకల్పన చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో ఈ యాప్‌ పనిచేస్తుందని, ప్రస్తుతం మెనూ పరిశీలనకు ఉపయోగిస్తామని వివరించారు. కోడిగుడ్ల సరఫరాకు డివిజినల్‌ స్థాయిలోనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ఇందులో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నామని అధికారులు చెప్పగా, దీనిలో పౌలీ్ట్ర యజమానులు పాల్గొనేలా నిబంధనలు ఉండాలని సీఎం ఆదేశించారు. స్వయం సహాయక గ్రూపులకు చిక్కీ(పల్లీచెక్క) తయారీ బాధ్యతలు అప్పగించాలన్నారు.
21 నుంచి కొత్త మెనూ...
రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల పైచిలుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ నెల 21 నుంచి భోజనంలో కొత్త మెనూ అమలు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, కొత్త మెనూ అమలు నిమిత్తం ప్రస్తుతం చెల్లిస్తున్న ఖర్చులకు అదనంగా ఒక్కో విద్యార్థికి ప్రాథమిక పాఠశాలలకు 43 పైసలు, ప్రాథమికోన్నత/ఉన్నత పాఠశాలలకు 40 పైసల చొప్పున చెల్లించాలని నిర్ణయించారు.
కొత్త మెనూ ఇదీ...
సోమవారం: అన్నం, పప్పుచారు, గుడ్డుతో కూర, చిక్కీ
మంగళవారం: పులిహోర, టమాటా పప్పు, గుడ్డు
బుధవారం: కూరగాయలతో అన్నం, బంగాళా దుంప కుర్మా, గుడ్డు, చిక్కీ
గురువారం: కిచిడీ(పెసరపప్పు అన్నం), టమాటా చెట్నీ, గుడ్డు
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డు, చిక్కీ
శనివారం: అన్నం, సాంబారు, పొంగలి

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " 21 నుంచి మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెనూ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM